పోస్ట్ ఆఫీస్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ-భిక్కనూర్:
పోస్ట్ ఆఫీస్ సేవలను, పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం భిక్కనూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎం రాజేందర్ రెడ్డి, ఎంఒ వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, సిబ్బంది సురేష్ కుమార్, సుధాకర్, రచన, రామ్ చంద్రం, సిద్ధ రాములు, రాజు, రాకేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.