పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

– జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌
నవతెలంగాణ- వనపర్తి
పోలింగ్‌ కేంద్రాల్లో ఉండవలసిన కనీస మౌలిక వసతులు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఉండేవిధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌ సూచి ంచారు. శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామ మండల స్థాయిలో నీ వివిధ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలు పరిశీ లించారు. వనపర్తి పట్టణంలోని ఉర్దూ మీడియం కళాశాలలో రెండు పోలింగ్‌ స్టేషన్లు, నూతన గ్రంధా లయంలో ఒక పోలింగ్‌ స్టేషన్‌ పరిశీలించారు. అనంతరం పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామంలో రెండు పోలింగ్‌ స్టేషన్లు, పామిరెడ్డిపల్లి గ్రామంలో నాల్గు పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించిన కలెక్టర్‌ పామిరెడ్డిపల్లి లో మరుగుదొడ్లు సరిగ్గా లేవని వాటిని వెంటనే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వీరాయి పల్లి గ్రామంలో ఒక పోలింగ్‌ స్టేషన్‌, ఘనపురం మండలంలోని కోతులకుంట తాండ లో ఒక పోలింగ్‌ స్టేషన్ను పరిశీలించారు. కోతులకుంట తాండా లో వెంటనే మరుగుదొడ్లు కట్టించాలని సంబంధిత ఎంపీడీఓ, పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. ఘనపురం మండల కేంద్రంలో నాల్గు పోలింగ్‌ స్టేషన్లు సందర్శించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ లో విద్యుత్‌, మరుగుదొడ్లు, మంచినీరు, సరైన వెలుతురు, దివ్యంగులకు ర్యాంప్‌ తదితర వసతులు ఉండాలని ఆదేశించారు. వనపర్తి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌, పెద్దమందడి, ఘనపురం తాసిల్దార్లు పాండు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.