ఎన్నికలలో మీడియా సెంటర్‌ పాత్ర కీలకం : కలెక్టర్‌

నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌
ఎన్నికలలో మీడియా సెంటర్‌ పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ జి.రవినాయక్‌ అన్నారు.శుక్రవారం ఆయన సమీకత జిల్లా అధికారి కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటుచేసిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల మీడియా కేంద్రాన్ని ప్రారంభించారు .మీడియా కేంద్రంలోనే ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ, సోషల్‌ మీడియా కమిటీల కార్యకలాపాలను సైతం కలెక్టర్‌ ప్రారంభించారు . ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన అనంతరం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సరైన విధంగా అమలు చేసేం దుకు చర్యలు తీసుకోవడం జరుగు తున్నదని, ఇందులో భాగంగానే మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా తెలియజేసేందుకు మీడియా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కోసం చేసే ఏర్పాట్లతో పాటు, ఎన్నికలకు జరిగే విష యాలను, అదేవిధంగా కలెక్టరేట్లో జరిగే కార్యక్రమాలను మీడియా కేంద్రం ద్వారా తెలుసుకో వచ్చని తెలిపారు. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియాలలో వచ్చే ప్రకటనల ముందస్తు అనుమతి కోసం ఎంసిఎంసి ద్వారా అన ుమతులను మీడియా సెంటర్‌ నుంచి పొందవచ్చన్నారు.అదే విధంగా సోషల్‌ మీడియా ద్వారా వచ్చే మెసేజ్‌ లు వాటి ఆడిటింగ్‌ కు మీడియా సెంటర్‌ పనికొస్తుందని తెలిపారు. మీడియా కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ,ఇంకా ఏవైనా సౌకర్యాలు అవసరమైతే ఏర్పాటు చేస్తామని తెలియారు. మీడియా కేంద్రం నుండి మీడియాకు సమాచారాన్ని ఇవ్వడంతో పాటు, మీడియా ప్రతినిధుల నుండి సమాచారాన్ని సేకరిం చేందుకు ఇది ఒక చక్కని వేదికలా ఉపయోగ పడుతుందన్నారు. మీడియా ప్రతినిధులు మీడియా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నామినేషన్ల మొదలుకొని ,మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలను బయట నుండి కవర్‌ చేసినప్పటికీ, జిల్లా స్థాయిలో జరిగే అన్ని కార్యక్రమాలు, కలెక్టరేట్‌ లో జరిగే కార్యక్రమాలు,మీడియా కేంద్రం నుండి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో మీడియా సైతం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా రెవిన్యూ అధికారి కే వి వి రవికుమార్‌ ,సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ ఇశ్రా నాయక్‌ ,మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు నారాయణ, మరో సభ్యులు ఈ- జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌ ,ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా స్టాఫ్‌ రిపోర్టర్లు,ఫోటో,వీడియో జర్నలిస్టులు,తదితరులు పాల్గొన్నారు.