బతుకమ్మ పండుగను పురస్కరించుకొని శ్రీకారం చుట్టిన చిన్నారులు

నవతెలంగాణ :రెంజల్ : రెంజల్ మండలంలో పెత్తర అమావాస్య సందర్భంగా ఎంగిలి పూలతో చిన్నారులు బతుకమ్మలను తయారుచేసి ఈరోజు మొదటి రోజు ఆటపాటలతో అలరించారు. తొమ్మిది రోజుల వరకు వివిధ పూలను సేకరించి ఇంటి ముందు వాకిట్లో బతుకమ్మ పాటలను పలువురిని ఆకర్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిన ఈ బతుకమ్మ పండుగను ఆడపడుచులు చిన్నారులు, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.