స్వయం సిద్ధ పుస్తకావిష్కరణ

నవతెలంగాణ-కల్చరల్‌
ప్రముఖ రచయిత్రి భండారు విజయ, పి.జ్యోతి రచించిన స్వయం సిద్ధ (ఒంటరి మహిళలు జీవిత గాథలు) పుస్తకావిష్కరణ సభ తెలంగాణ భాష సంస్కతి శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ మణళిని పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒంటరి మహిళలు తమ జీవితాన్ని ఏకాంతంగా మార్చుకున్నప్పుడే సంతోషంగా జీవించగలు గుతారని పేర్కొన్నారు. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా జీవిస్తున్నారని వివరించారు. సమాజంలో ఒంటరి మహిళ లపై సానుభూతి కాకుండా వారిని గౌరవిం చాలన్నారు. ఒంటరి మహిళ జీవిత గాధలను కథలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.ీ కార్యక్రమంలో డాక్టర్‌ జతిన్‌ కుమార్‌, గీతాంజలి, డాక్టర్‌ భారతి, రుక్మిణి రావు, డాక్టర్‌ ఎస్‌. కామేశ్వరి, సుభద్ర దేవి పాల్గొన్నారు.