నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగబోయే ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్లో పాల్గొని ప్రసంగించేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్కు ఆహ్వనం అందింది. ఈ ఏడాది కాన్ఫరెన్స్ భారతదేశం ఎదుగుదల-వ్యాపారం, ఆర్థికం, సంస్కృతి అనే అంశాన్ని ఎంచుకుంది. ఇటీవల రాష్ట్ర వృద్ధిలో కేటీఆర్ ప్రభావం చూపిస్తున్న నాయకుడనీ, పెట్టుబడులకు గమ్యంగా రాష్ట్రాన్ని మార్చడంలో స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడింది. ఇండియా కాన్ఫరెన్స్ లో భారత సంతతికి చెందిన విదేశీయులు, విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధాన నిపుణులు పాల్గొననున్నారు.