ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

నవతెలంగాణ-సిటీబ్యూరో
టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని టీడీపీ సికింద్రాబాద్‌ పార ్లమెంటరీ అధ్యక్షులు పి.సాయిబాబా తెలిపారు. 19 ఏండ్లుగా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాక్షేత్రంలో ప్రజ లతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణలో టీడీపీ అయిపో యిందన్న వారు నేడు టీడీపీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారన్నారు. తెలంగాణలో ఎన్టీఆర్‌ శత జయంతి సభలు విజయవంతం అవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు 17 పార్లమెం టులో 10 శత జయంతి సభ (మినీ మహానాడు)లు విజయవంతంగా పూర్తయినాయన్నారు. ఇక రాజమం డ్రిలో నిర్వహించనున్న జాతీయ మహానాడును సైతం విజయవంతం చేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తల కు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నల్లెల్ల కిషోర్‌, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజుగౌడ్‌, అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి బిల్డర్‌ ప్రవీణ్‌, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్సి పెద్దోజు రవీంద్రాచారి, పరుశురామ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.