సాధించుకున్న తెలంగాణలో న్యాయం లేదు..

– సీఎం కెసిఆర్ వి గాలి మాటలు..
– ప్రజా సమస్యలు గాలికి..
– మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ 
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ :
సీమాంధ్రుల పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే  పోరాడి సాధించుకున్న తెలంగాణలో  యావత్ ప్రజానీకానికి అన్యాయం జరుగుతుందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. సోమవారం హుస్నాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్, డీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు జరగలేదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హుస్నాబాద్ సెంటిమెంట్  సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రసంగంలో పసలేదన్నారు. 400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, 2018 నుండి ఇప్పటివరకు 400 ఫోను మిగతా 800 రూపాయలు తిరిగి చెల్లిస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని పదేళ్లు కాలయాపన చేసిన కేసీఆర్, మళ్లీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పూర్తి చేస్తానని అనడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి చెందాల్సిన హుస్నాబాద్ ప్రాంతంలోని కొత్తకొండ దేవాలయం, ఎల్లమ్మ దేవాలయం, పొట్లపల్లి, సింగరాయ దేవాలయాలు అభివృద్ధి చెందలేదన్నారు. కాంగ్రెస్  గ్యారెంటీలను విమర్శించి  మా పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా బీఆర్ఎస్ నాయకులు మారారన్నారు. కాంగ్రెస్ పథకాలనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కాపీ కొట్టారని పేర్కొన్నారు. నిన్న హుస్నాబాద్ లో పెట్టిన మీటింగులో పరస్పర పొగడ్తలు తప్ప ప్రజలకు మేలు జరిగేదేమీ లేదన్నారు. గాలి మాటలు, పొద్దటికో మాట మాపటికో మాట మాట్లాడే కేసీఆర్ 2018 లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు.  హుస్నాబాద్ ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంగా ఉన్నారే తప్ప, హుస్నాబాద్ ప్రాంత సమస్యలపై కేసీఆర్ ను అడుగరన్నారు. హుస్నాబాద్ ఉత్సవ విగ్రహంగా ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మార్చి ఈ ప్రాంత సమస్యలపై గలం విప్పే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, బంక చందు, వెన్న రాజు, బూరుగు కృష్ణస్వామి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.