– రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంతి రావు – కుమ్మరి సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
నారాయణపేటటౌన్: తెలంగాణ కుమ్మర సంఘం నారాయణపేట జిల్లా జనరల్ బాడీ సమావేశం భగత్ సింగ్ భవన్‌లో దత్తు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షు లు నడికుడి జయంతి రావు హాజరై మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో కులవత్తులు కూడు పెట్టడం లేదన్నారు. కార్పొ రట్ కంపెనీలు కులవత్తులను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణలో భాగంగా కులవతులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కులవత్తులను కాపాడాలన్నారు. నూతన సాంకే తి కను అందించి కులవత్తుదారులను ఆదుకోవాలని కోరా రు. ప్లాస్టిక్ , అల్యూమినియం వస్తువులను నిషేధించి, కుమ్మ రు లు తయారు చేసిన మట్టి వస్తువులనే వాడే రకంగా ప్రభు త్వం చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే కులవత్తిదారులకు ఉపాధి లభిస్తుందన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కులవత్తిదారులకు క్లస్టర్ ఏర్పాటు చేసి వత్తి నైపుణ్యం శిక్షణ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కోరారు. అవసరమైన స్థలాన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరయ్య, శ్యాంసుందర్, కాశీనాథ్ మాట్లాడారు. అనంతరం తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నారా యణపేట జిల్లా అధ్యక్షులుగా బోయిన్ పల్లి రాజు కుమ్మరి, గౌరవ అధ్యక్షులుగా దత్తు (నారాయణపేట టౌన్), అసోసి యేట్ అధ్యక్షులుగా యాదయ్య, (కోస్గి) జిల్లా ప్రధాన కార్యద ర్శిగా కుమ్మరి రాజు ప్రజాపతి (మరికల్,) కోశాధికారిగా లింగరాజు దామరగిద్ద, ఉపాధ్యక్షులుగా వీరేష్ మాగనూరు, అంజప్ప మక్తల్, సత్యనారాయణ నర్వ, వెంకటయ్య గుండు మాల్, సహాయ కార్యదర్శిగా చిన్న తిరుపతి, వెంకటేష్, వీరేష్ మాగనూరు, తదితరులతోపాటు 15 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కుమ్మరి రాజు మాట్లాడుతూ తెలంగాణ కుమ్మరి సంఘాన్ని నారాయణపేట జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసి కుమ్మరులను చైతన్యం చేసి కుమ్మరుల హక్కుల రక్షణ కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని, తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ నుంచి కుమ్మరులకు వచ్చే సబ్సిడీలను అందరికీ చేరే విధంగా కృషి చేస్తానని అన్నారు.