– ప్రభుత్వ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
నవతెలంగాణ-మట్టెవాడ
పోరుగడ్డ ఓరుగల్లులో ఆడబిడ్డలు ఘనంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మహిళల హక్కులపై పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ వరంగల్ జిల్లా అధ్యక్షులు చుక్క ప్రశాంత్ పిలుపునిచ్చారు. రంగశాయిపేట జూనియర్ కళాశాల లో ఎస్‌ఎఫ్‌ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించరూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లను పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, అనే నినాదంతో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా మహిళల ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రాజుల నిరంకుశ పా ల నకు వ్యతిరేకంగా భూస్వాములు పెత్తందారులు దొరలకు వ్యతిరేకంగా మహిళ లం దరూ ఉద్యమించి బతుకవమ్మ, బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ పోలీసు రజాకారులను తరిమికొట్టినటువంటి చరిత్ర మహిళలకు ఉన్నదనీ, ఈనాడు సమాజంలో కేంద్ర ప్రభుత్వం బేటిబచావో, బేటి పడావో ఆడపిల్లను రక్షించుకుం దాం ఆడపిల్లను చదివించుకుందాం. అని మోడీ ప్రభుత్వం చెప్పినప్పటికీ మహిళ లపై జరుగుతున్న దాడులకు కనీసం చీమకుట్టినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం ఉన్నదనీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మహిళలకు అన్యాయం జరగకూడదని షీ టీమ్స్‌ను తీసుకొచ్చారు కానీ ఇప్పటివరకు అది ఆచరణలో లే కుండా పోయిందనీ అంతకంతకు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయనీ అన్నారు. మహిళలపై వివక్షత చూపుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పటకైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధోరణి మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మహేష్, రామ్ చరణ్, సాదిక్, జగన్, అనూష, శైనాజ, ప్రియా, మానస, తదితరులు పాల్గొన్నారు.