అంబేద్కర్‌ సేవలు మరువలేనివి

లండన్‌లోని అంబేద్కర్‌ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
లండన్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ అక్కడి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ మ్యూజియాన్నిఆదివారం సందర్శిం చారు. బారిష్టర్‌ చదువు కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన అంబేద్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. ఎంతో ఆసక్తితో ఈ మ్యూజియాన్ని తిలకించిన కేటీఆర్‌ ఆనాడు అంబేద్కర్‌ నివసించిన గదిని కూడా చూశారు. హైదరాబాద్‌లో ప్రతిష్టించిన అంబేద్కర్‌ విగ్రహ నమూనాను మ్యూజియం అధికారులకు కేటీఆర్‌ బహూకరించారు. ఇండియన్‌ హై కమిషన్‌కు అంబేద్కర్‌ చిత్రపటాన్ని ఇచ్చారు. బాబా సాహెబ్‌ సహకారాన్ని హైలైట్‌ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అసాధారణ ప్రయత్నాలకు ఎఫ్‌ఏబీఓ-యూకే కూడా మంత్రి కేటీఆర్‌ను సత్కరించింది. విలియం గౌల్డ్‌, క్రిస్టోఫ్‌ జాఫ్రెలాట్‌ల తో కలిసి రచించిన ‘అంబేద్కర్‌ ఇన్‌ లండన్‌’ పుస్తకం సంతకం కాపీని మంత్రి కేటీఆర్‌కు ఎఫ్‌ఏబీఓ ప్రెసిడెంట్‌ సంతోష్‌దాస్‌ అందించారు. ప్రజాస్వా మ్య, సంక్షేమ భారత నిర్మాణంలో అంబేద్కర్‌ చేసిన కృషిని ఈ తరానికి తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందించింది.
కేటీఆర్‌తో ఇన్‌క్రెడిబుల్‌ హస్క్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ చర్చలు
ఇన్‌క్రెడిబుల్‌ హస్క్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ యూకే సీఈఓ కీత్‌ రిడ్జ్‌వే, ఇన్‌క్రేడిబుల్‌ హస్క్‌ ఇండియా సీఈఓ సీకా చంద్రశేఖర్‌ తదితరులు మంత్రి కేటీఆర్‌ను లండన్‌లో కలిశారు. హస్క్‌ పెల్లెట్స్‌, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ గురించి చర్చించారు. తెలంగాణలో 25మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి ఆ సిద్ధంగా ఉన్నామని, ఏడాది వెయ్యి మెట్రిక్‌ టన్నుల బయో పెల్లెట్స్‌ ఉత్పత్తి చేస్తామనిఇన్‌క్రెడిబుల్‌ హస్క్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఈ సందర్భంగా వెల్లడించింది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.