గ్రామ అభివృద్ధి కమిటీల పై పిడి యాక్ట్ అమలు చేయాలి

 – రాష్ట్ర గీత కార్మిక సంఘ కార్యదర్శి విటల్ గౌడ్
నవ తెలంగాణ- కోటగిరి: గీత కార్మికుల కుటుంబాల పైన గ్రామ అభివృద్ధి కమిటీలు దాడులను అరికట్టాలని గురువారం కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార సంఘం ఆధ్వర్యంలో 65వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోటగిరి బస్ స్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార సంఘం జెండాను సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.విటల్ గౌడ్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ విట్టల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం గీత కార్మికుల కుటుంబాల కోసం నిరంతరం పోరాటాలు చేసిన ఏకైక సంఘం తెలంగాణ గీతా పనివాళ్ల సంఘం అని, కామ్రేడ్ ధర్మ బిక్షం నాయకత్వాన 1957లో సంఘాన్ని స్థాపించి గీత కార్మికుల హక్కుల కోసమై నిరంతరం పోరాటాలు చేసి కార్మికులకు చైతన్యపరిచి ఉద్యమల ద్వారా తన హక్కులు సాధించుకోవాలని చెప్పిన మహనీయుడు కామ్రేడ్ ధర్మ బిక్షం మని, ప్రస్తుతం గీతా కార్మికుల కుటుంబాల పైన నిజాంబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల  పేరుమీద గీత వృత్తి కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గీత వృత్తి పైన కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులకు గ్రామ అభివృద్ధి పేరు మీద డబ్బులు డిమాండ్ చేస్తూ గీత కార్మికులకు వేధిస్తున్నారని, గ్రామ అభివృద్ధి కమిటీల పైన పిడి యాక్ట్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే గ్రామాలలో చీఫ్ లిక్కర్ వలన కళ్ళు అమ్మకాలు లేక గీత కార్మికుల కుటుంబాలు వలస వెళ్తున్నారని పెరుగుతున్న మార్కెట్లలో ధరలకు అనుకూలంగా కళ్ళు అమ్మకాలు జరుపుతున్నామని కానీ వీసీడీ ఈ మాటలను పట్టించుకోకుండా గీతా కార్మికుల కుటుంబాలకు ఇబ్బంది పెట్టడం  ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గీతా పని వారి సంఘం నాయకులు బి వెంకట్ గౌడ్, సురేష్ గౌడ్, పండరి గౌడ్, నరేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.