గర్భిణులకు న్యూట్రి కిట్స్ పంపిణీ

నవ తెలంగాణ- నాంపల్లి:   నాంపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సయ్యద్ ఇక్బాల్ ఏడు మంది గర్భిని స్త్రీలకు గురువారం న్యూట్రి కిట్స్ అందజేశారు. ఈ కిట్స్ లో ఖర్జూర పండ్లు రెండు బాక్స్ లు, రెండు మదర్ హార్లిక్స్ పౌడర్ బాక్స్ లు, నెయ్యి డబ్బా, రెండు బెల్లం పల్లి పట్టీలు, మూడు ఐరన్ టానిక్ సీసాలు ఉంటాయని, ఈ కిట్స్14-26 వారాల గర్భిణులకు పిహెచ్ సి లో, 27-34 వారాల గర్భిణులకు ఏరియా హాస్పిటల్ లేదా జిల్లా ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండవ ఏ ఎన్ ఎం లక్ష్మి, రేణుక, ఆశా కార్యకర్తలు సునీత, కవిత తదితరులు పాల్గొన్నారు.