మన సంస్కృతి సంప్రదాయాల పండగ బతుకమ్మ: ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ ఆర్మూర్  

మన సంస్కృతి సాంప్రదాయాలు పండగ బతుకమ్మ అని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టణంలోని పలు వార్డులలో గురువారం బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించినారు.  కవిత, ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక మహిళలతో కలిసి తీరక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ వేడుకను అధికార పండుగగా గుర్తించిందని, తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వైద్యులు డాక్టర్ మధుశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్న, పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు జనార్ధన్ గౌడ్ ,మల్యాల నర్సారెడ్డి, కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.