నవతెలంగాణ- నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ (ఏ) గ్రామంలో దోనపల్లి విజయ (42) బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై యాదిగిరి గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ రూరల్ మల్కాపూర్(ఏ) గ్రామానికి చెందిన దోనపల్లి విజయ కులానికి చెందిన చంద్రయ్య మృతురాలి యారలుతో అక్రమ సంబంధం పెట్టుకోగా తన ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మనస్థాపం చెంది ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నట్లు మృతురాలి సోదరుడు నర్సయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.