న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన మనీశ్ సిసోదియాకు కోర్టులో మళ్లీ ఊరట లభించలేదు. ఆయనకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. నవంబరు 22 వరకు కస్టడీ కొనసాగుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరవాత ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. అరెస్టు అయినప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. సిసోదియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా ఢిల్లీ కోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ.. నవంబరు 22 వరకు కస్టడీని పొడిగించింది.