పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఏసిపి

పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న దృశ్యం
పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న దృశ్యం
నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏసిపి కిరణ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ సతీష్, ఎస్ఐ సుధీర్ రావు పాల్గొన్నారు.