రాష్ట్రానికి కేంద్ర బలగాలు

Central forces to the stateనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వంద కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి శుక్రవారం చేరుకున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 300 కంపెనీల కేంద్ర బలగాలను కోరగా, తొలి విడతగా వంద కంపెనీల భద్రతా సిబ్బందిని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పంపింది. ఒక్కో కంపెనీలో 60 నుంచి 80 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. అస్సాం రైఫిల్స్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండో టిబెటిన్‌ బోర్డర్‌ పోలీస్‌, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, సశస్త్ర సీమాబల్‌ దళాలకు చెందిన భద్రతా బలగాలు దీనిలో ఉన్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో 46 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యాక మరికొన్ని కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రానికి రానున్నాయి.