నవతెలంగాణ-చెన్నారావుపేట
మండల పరిధిలోని కోనాపురంలో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు వార్డుల్లో నీటి కొ రత కొనసాగుతుంది. ఇన్ని రోజులపాటు మిషన్ భగీరథ నీటితో కొనసా గించిన ప్రజలు ఇటీవల మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు ప్రతిసారి తీవ్రఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ కేవలం తాగు నీటికిమాత్రమే కానీ కోనాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మూడు వార్డులకు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీటినీ ప్రజలకు సరఫరా చేస్తున్నారు… కనీసం మిషన్ భగీరథ నీటితోనైనా రోజులు గడుస్తున్నా యని ప్రజలు అనుకుంటుండగా, అప్పుడప్పుడు కలిగిన అంతరాయాల వల్ల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. జీపీ నుండి మాకు యధా విధిగా నల్ల నీరు కావాలని ఎన్ని సార్లు అడిగిన అధికారులు, కార్యదర్శి పట్టించుకోవడంలేదని, గ్రామపంచాయతీ నిధు లు కేవలం సిసిరోడ్లకే వాడుతున్నారని, గ్రామంలో శానిటైజేషన్ పనులు కూడా పూర్తిగా చేయడంలేదని గ్రామ ప్రజలు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.