సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ కు శ్రీరామరక్ష: వేముల ప్రశాంత్ రెడ్డి

నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కెసిఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో వ్యక్తిగత కారణాలతో బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా విలేకరులతో బుధవారం మాట్లాడారు. కెసిఆర్ సంక్షేమ పథకాలతో జిల్లాలో ఐదు నియోజకవర్గాలను గెలవనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. బోధన్ లో షకీల్ ఆమీర్ గెలుపు ఖాయమని మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలను మరింత ఆకర్షించిందని తెలంగాణ రాష్ట్రంలో పేదలు, బడుగులు, అభాగ్యులు మరియు రైతులు ఎంతో సుఖసంతోషాలతో ఉన్నారని మూడోసారి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, రామ్ రెడ్డి, రమణారెడ్డి, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.