నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారులకు అల్పాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. నరేంద్ర శేఖర్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యాయులు నరేష్, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ బేగరీ గంగమణి తదితరులు పాల్గొన్నారు.