ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూపాలి

– ఏపీ ఎం రవీందర్ రెడ్డి
నవ తెలంగాణ- జక్రాన్ పల్లి:

ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల వైపు మొగ్గు చూపాలని ఏపిఎం రవీందర్ రెడ్డి గురువారం అన్నారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య సమావేశం వనిత అధ్యక్షతన జరిగింది. మండలంలోని అన్ని గ్రామ సంఘాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలలో పొదుపు పెంచుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల వైపు ముగ్గు చూపాలని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా శ్రీనిధి ద్వారా గ్రామ సంఘాల ద్వారా రుణాలు తీసుకొని న్యూ ఎంటర్ప్రైజెస్ నెలకొల్పాలని సూచించారు. అదే విధంగా ఆక్వా కంపెనీ ద్వారా చేపల పెంపకం పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఆసక్తిగల మహిళా రైతులు ముందుకు వచ్చి తమకున్నటువంటి వరి పొలంలోని నాలుగు గుంటల భూమి కేటాయించినట్లయితే చేపల పెంపకానికి అనువగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వనిత మండల సమైక్య ప్రతినిధులు అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామ సంఘాల అధ్యక్షులు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మండల సమైక్య సిబ్బంది పాల్గొన్నారు.