మరణించిన సిబ్బంది కుటుంబానికి చెక్ పంపిణి చేసిన పోలీస్ కమీషనర్

నవతెలంగాణ- కంటేశ్వర్:
పోలీస్ శాఖలో 5-8-2023 రోజున ఎ. దయానంద్ రావ్, ఎస్.ఐ, పోలీస్ కంట్రోల్ రూమ్, నిజామాబాద్ వారి ఇంట్లో గుండెపోటుతో మరణించడం జరిగింది. భద్రత ఎక్సిగ్రేషియా రూపంలో గల చెక్కు రూ॥ 15,93,280/- (పదిహేను లక్షల తొంబై మూడు వేయిల రెండు వందల ఎనబై రూపాయల) చెక్కును గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ శింగెనవార్, ఐ.పి.యస్ చేతుల మీదుగా కీ॥ శే॥ ఎ. దయానంద్ రావ్ సతీమణి అయిన ఎ. మంజుల కి చెక్కును అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ )  గిరిరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.