బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్ ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లు సర్పంచ్ తెలు విజయ్ కుమార్, ఎంపిటిసి కచ్చకాయల అశ్విని శ్రీనివాస్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహించామని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ప్రత్యేకంగా అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమం లో  డాక్టర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, నర్సయ్య, హౌస్ల రమేష్, యూసుఫ్ అలీ, శ్రీకాంత్ శాఫి మహమ్మద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.