ప్రజలకు మనం చేసిన సేవలు గుర్తు చేయాలి

– బిఎల్ఎఫ్ కామారెడ్డి నియోజకవర్గ  యం, ఎల్ ఎ, అభ్యర్థి సిద్ధి రాములు..
నవ తెలంగాణ- తాడ్వాయి :కామారెడ్డి నుండి బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిద్ధరాములు బి ఎల్ ఎఫ్ కార్యకర్తలకు గురువారం దిశా నిర్దేశం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న బిఎల్ ఎఫ్, ఎన్నికల కార్యలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో కార్మికుల, విద్యార్థుల, పేద ప్రజల సమస్యలపై ఎన్నోసార్లు పోరాటాల లో భాగంగా రాస్తారోకోలు, ధర్నాలు చేశామని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. బిఎల్ఎఫ్, బి ఎల్ టి యు, బి ఎల్ పి ఏ పార్టీ అయినా ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. డబల్ బెడ్ రూమ్ ల కోసం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి వద్ద నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులకే ఇవ్వాలని అడిగినందుకు బిఎల్ఎఫ్ నాయకులైన ఆంజనేయులు, సాయి కృష్ణ లపై కేసులు నమోదు చేశారన్నారు. వామపక్ష పార్టీలమని చెప్పుకుంటున్న సిపిఎం, సిపిఐ పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఎవరితో పడితే వారితో పొత్తులు పెట్టుకుంటూ ఉన్నారని, బిఎల్ఎఫ్ పార్టీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 40 మందితో బరిలో దిగింది అన్నారు. అందులో 20 మంది ఎస్సీ , ఎస్టీలు ఉండగా 20 మంది బీసీలకు ఇచ్చారని బి ఎల్ ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. రాష్ట్ర జనాభాలో 58 శాతం ఉన్న బీసీలే ముఖ్యమంత్రి కావాలని  అన్నారు. ఆ విధంగా గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు.  ఈ కార్యక్రమం లో బిఎల్ ఎఫ్, రాష్ట్ర నాయకులు, యం, ఆంజనేయులు, వడ్ల సాయి కృష్ణ, బి. జగదీష్, సిద్దిరాములు జీవిత భాగస్వామి, సిరిగాద సబిత, కామారెడ్డి జిల్లా నాయకులు, గంగామణీ, మల, లక్ష్మి, శ్యామల, స్వప్న, స్తెనాజ్, మురళి, బిక్కనూర్, మండలం బిఎల్ ఎఫ్, నాయకులు, స్వామి, భారతీ, దోమకొండ మండల బిఎల్ ఎఫ్, నాయకులు, జి.రాజాశేఖర్, నాంపల్లి, బీబీ పేట్ మండల నాయకులు, చంద్ర కాంత్ రెడ్డి, తలరి, స్వామి, బాబు, మచరెడ్డి, మండల బిఎల్ ఎఫ్, నాయకులు, శ్రీ నివాస్, దర్మారెడ్డి, గురుమూర్తి,కిష్టమ్మ, గంగాధర్,ఉన్నారు