– సీపీఐ(ఎం) నాయకులు, మాజీ మంత్రి కొండ సురేఖ
నవతెలంగాణ – మట్టెవాడ
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జక్కలొద్దీలో పేదలు వేసుకున్న గుడిసెలలో గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేసి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అనుచరులు కొందరు అక్రమంగా గుడిసె వాసులను నిర్బం ధించి, ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపిస్తూ సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య ఆధ్వ ర్యంలో జిల్లా కమిటీ సభ్యులు జొక్కలోద్ది ఏరి యా బాధ్యులతో కలిసి జక్కలొద్ది భూ పోరా టానికి వెళ్లిన సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుడిసె వాసులతో మాట్లాడాలని చూస్తున్న సందర్భంలో రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ను బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కొందరు దాడి చేసి తోసి వేశారు. గుడిసె వాసులతో మాట్లాడడానికి వెళ్తున్న వారిని అడ్డగించడంతో కొంత ఘర్షణ వాతా వరణం నెలకొంది. ఇంతలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండ సురేఖ గుడిసె వాసులతో మాట్లాడడానికి సీపీఐ (ఎం) నాయకులతో కలిసి లోపలికి వెళ్లాలని చూడడంతో గొడవ ముదిరే అవకాశం ఉండ డంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డగించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున సహకరించాలని నాయకులను కొండ సురేఖను డీసీపీ రవీందర్, మామునూర్ ఏసీపీ సతీష్ బాబు వారించారు. ఎవరి పైన ఆరోపణలు ఉంటే ఫిర్యాదు చేయా లని పోలీసులు చర్యలు తీసుకుంటారని సూచిం చారు. అనంతరం సీపీఐ(ఎం) నాయకులు, మాజీ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ… అధికార పార్టీలో ఉన్న నాయకులకు ఒకలా ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు ఒకలా చూడడం మంచిది కాదని పోలీసుల మాటను తాము గౌరవిస్తామని అన్నారు. పోలీసుల ముందే సిపిఎం నాయకులపై దాడి జరుగుతున్న పోలీసులు అడ్డుకోకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని హితవు పలికారు. గుడిసె వాసులకు అన్యాయం జరుగుతే ఊరుకోమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. సందర్శనకు వెళ్లిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు, నలిగంటి రత్నమాల, సింగారపు బాబు, ముక్కెర రామస్వామి, ఆరూరి కుమార్, డివైఎఫ్ఐ అధ్యక్షులు సాంబమూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్, దుర్గయ్య, నాయకులు పాల్గొన్నారు.