తాసిల్దార్ ముందు పలువురిని బైండోవర్ చేసిన పోలీసులు

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం లో పోలీసులు పలువురుని తాసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ చేసినందుకు ముందస్తు బైండోవర్ చేసినట్లు  పోలీసులు తెలిపారు. సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ తిరిగి ఇదే ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే 2 లక్షల వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ నవీన్ తదితరులు ఉన్నారు.