
తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ మాస్ కమ్యూనికేషన్ లో సింగారం శ్రీనివాస్ పరిశోధక విద్యార్థి బహిరంగ మౌఖిక వైవాను శనివారం నిర్వహించారు.సింగారం శ్రీనివాస్ “రోల్ ఆఫ్ రేడియో ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఏ స్టడీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ ప్రోగ్రామ్స్” అనే అంశంపై సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ పర్యవేక్షణలో లో థీసిస్ సమర్పించారు.అత్యంత వేగంగా శాస్త్ర సాంకేతిక రంగంలో మారుతున్న వర్తమాన పరిస్థితులలో గ్రామీణాభివృద్ధిలో రేడియో పాత్రను సేకరించిన దత్తాంశం ఆధారంగా సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేసి యూనివర్సిటీ కి సమర్పించారు. రేడియో పాత్ర నేటికీ కీలకంగా ఉందని గుర్తించారు.ఈ వైవా కార్యక్రమానికి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా ప్రొఫెసర్ శ్రీ రామానంద తీర్థ మరట్వాడ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దీపక్ షిండే హాజరై సిద్ధాంత గ్రంథంపై నిర్మాణాత్మక ప్రశ్నలు సంధించి జవాబులు అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్. పి.శాంత భాయీ డాక్టర్ మోహన్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.