క్యాంపస్‌ అంబాసిడర్లు ఎన్నికల్లో సైనికుల్లా పని చేయాలి

– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పీ.ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్‌
క్యాంపస్‌ అంబాసిడర్లు ఎన్నికల్లో సై నికుల్లా పని చేయాలి జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్‌ ప్రావీణ్య పేర్కొన్నారు. భార త ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జి ల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పీ ప్రా వీణ్య శనివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హా లులో క్యాంపస్‌ అంబాసిడర్‌గా గుర్తించి న విద్యార్థులతో జరిగిన ఓటర్‌ అవగా హన కార్యక్ర మంలో పాల్గొని సమర్ధవం తంగా చైతన్యం కల్పించుటకు ప లు సూ చనలు చేశారు. కాలేజీలో బృం దాలుగా ఏర్పడి అర్హులైన ప్రతిఒక్కరినీ ఓటర్‌ అవ గాహనతోపాటు 18 ఏళ్లు నిండిన యువ తి యువకులు ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేయనట్లైతే నామినేషన్‌ తేది లోపు యాప్‌లో ఫామ్‌ 6 ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అ న్నారు. వారం రోజుల్లో మీ మీ కాలేజీ పరిసర ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థు లు, ప్రజలు ఎక్కువగా సంచరించు ప్రాం తాలైన బస్‌ స్టేషన్‌, రైల్వే స్టేషన్‌, మార్కె ట్‌ పరిసరాల్లో ఫ్లాష్‌ మాబ్‌ ల ద్వారా ఓటర్లలో అవగాహన కల్పిం చి ఓటరు శాతాన్ని పెచే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్నారు.గత ఎన్నికల్లో నర్సంపేట,వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఓట్లు పోల్‌ శాతం 91శాతం కాగా, వరం గల్‌ తూర్పు నియోజక వర్గం పరి ధిలో 72శాతం ఓట్లు పోలింగ్‌ జరిగిందని అ న్నారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం త గ్గుటకు అర్బన్‌ యూత్‌ కారణమని అ న్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇలాటి పరిస్థి తులు పునరావతం కాకుండా ప్రజలు, యువకుల్లో అవగాహన కల్పించాలన్నా రు. ఓటింగ్‌ రోజున ప్రభుత్వం సెలవు ప్ర కటించడంవలన కొంతమంది స్వప్రయో జనాల కోసం ఓటును నిర్లక్ష్యంచే యుట కు ఆస్కారమున్నందున, ఓటు ప్రాముఖ్య తను తెలిసేలా జిల్లాలోని ప్రతి డిగ్రీ కాలే జీ విద్యార్థులు ప్రజలకు, యువతకు అవ గాహన కల్పించాలని అన్నారు.భారత రా జ్యాంగంలో పొందు పరచిన ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఎ థికల్‌ ఓటింగ్‌ జరిగేలా మీవంతు కృషి చేయాలని కలెక్టర్‌ కోరారు.ఎలక్షన్‌ కమి షన్‌ గైడ్‌లైన్స్‌ మేరకు మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌, యూత్‌ మేనేజ్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసామని అన్నారు. ప్రతి పో లింగ్‌ స్టేషన్‌లో పీడబ్ల్యుడీ, సిటిజన్స్‌ సు నాయసంగా ఓటుహక్కు వినియో గించు టకు సౌకర్యాలు కల్పించామని, వారికి పోలింగ్‌ రోజున సహాయార్థం కళాశాల ల్లోని 18 ఏళ్ల లోపు ఉత్సా హవంతులైన విద్యార్థుల పేర్లు నమోదు చేసిన ట్లయితే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి వారి సహాయం తీసుకోవడం జరుగు తుందన్నారు .
మొబైల్‌ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సీ -విజిల్‌ యాప్‌ ఉపయోగించుకొని, ఓట రును ప్రలోభాలకు గురి చేసే ఎలాంటి చర్య లైనా, సీ- విజిల్‌ యాప్‌ ద్వారా మీ పేర్లు బహిర్గతం అవకుండా ఫిర్యాదు చే యాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. ఈ సమా వేశంలో స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నరసిం హమూర్తి, పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్‌ బాల కష్ణ , జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.