– ముకేశ్ అంబానీకి బెదిరింపు
ముంబై : రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీని చంపేస్తా మని బెదిరింపులు వచ్చినట్టు పోలీ సులు తెలిపారు. ఈ-మెయిల్ ద్వారా ఓ వ్యక్తి బెదిరించాడని, తమకు రూ. 20 కోట్లు ఇవ్వకుంటే, చంపేస్తామని ఆ మెయిల్ లో హెచ్చరించారని, తమ వద్ద బెస్ట్ షూటర్స్ కూడా ఉన్నట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. షాదాబాద్ ఖాన్ పేరుతో ఉన్న మెయిల్ నుంచి అక్టోబరు 27న బెదిరింపు వచ్చింది. ఆంటిలియాలోని అంబానీ నివాసానికి చెందిన సెక్యూ రీటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీ సులు ఫిర్యాదు నమోదు చేశారు. ముంబైలోని గామ్దేవి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ 387, 502(2) సెక్షన్ల కింద కేసును బుక్ చేశారు.