ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.50 లక్షలు పటివేత

నవతెలంగాణ – మాక్లూర్ : మండలంలోని పోలీసు స్టేషన్ రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా రూ. 2.50 లక్షలు పట్టుకున్నట్లు ఎస్సై సుదీర్ రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మధ్యాహ్నం సమయంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మాదాపూర్ గ్రామానికి చెందిన రావుల చంద్ర కరణ్ రూ. 2,50 లక్షలు తన వెంట తీసుకెళ్తూ పట్టుబడినారు. ఈ డబ్బులకు అతను ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ డబ్బులను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలపై ఐటి అధికారులకు అప్పగించినాట్లు ఎస్సై తెలిపారు.