ప్రజలే కుటుంబ సభ్యులు : మంత్రి సతీమణి

పెబ్బేరు: వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డికి నియోజకవర్గంలోని ప్రజలందరూ కుటుంబ సభ్యులేనని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి అన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి తిప్పాయిపల్లి గ్రామంలో సోమవారం ఉదయం పాత పల్లి గ్రామంలో మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మంత్రి తన ధ్యేయంగా పెట్టుకుని ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేశాడని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి వనపర్తి శాసనసభకు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పోటీ చేస్తున్నారని, ప్రజలు ఆయన ఆశీర్వదించి ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఆత్మకూర్‌ : ఆత్మకూరు పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో సోమవారం బీఆర్‌ ఎస్‌ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. సోమవారం పట్టణంలోని రెండవ, నాలుగవ ,ఆరవ ,9వ వార్డులో ప్రచారం కొనసాగింది. ఎవరొచ్చినా అబివద్ధి సారదికి సాటి కాలేరు
మదనాపురం : దేవరకద్ర నియోజకవర్గంలో కొత్త కొత్తగా ఎందరొచ్చినా మళ్లీ దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డినే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని జెడ్పీిటీసి మహానంది కష్ణయ్య యాదవ్‌ తెలిపారు. మదనాపురం మండలంలోని అజ్జకొలు గ్రామంలో బీఆర్‌ఎస్‌ తరపున సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు.అనంతరం ప్రజా సంక్షేమానికి తోడ్పాటునిచ్చే మేనిఫెస్టో పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కావలి రాములు, మండల ఉపాధ్యక్షులు కరుణాకర్‌ రెడ్డి, గ్రామ అధ్యక్షులు శాంత మూర్తి,నాయకులు బోయిని శ్రీనివా సులు, చింతకాయల శ్రీను, కరగడ్ల మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.