సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రభుత్వ పిలుపు మేరకు రాష్ట్రీయ ఎక్తా దివాస్ కార్యాక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ శింగెనవార్, ఐ.పి.యస్. ఆదేశానుసారంగా మంగళవారం అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. జయిరామ్ అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ పి. గిరిరాజు ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీసులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యాక్రమంలో సి.సి.ఆర్.బి, ఎ.సి.పి రవీంధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఎ.సి.పి శ్రీవేణుగోపాల్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్, ఆఫీస్ సూపరింటెండెంటులు, ఐ.టి కోర్ టీమ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎ.ఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.