10 వరకు గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలు.. 

జిల్లా పశు వైద్యధికారి ఎస్పీ రెడ్డి
నవతెలంగాణ-బెజ్జంకి :
ఈ నెల 10 వరకు మండలంలోని అయా గ్రామాల్లో గొర్రెలు, మేకలకు పీపీఆర్(పారుడు వ్యాది నివారణ)టీకాలు పంపిణీ చేయనున్నట్టు మండల పశు వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలను జిల్లా వైద్యాధికారి ఎస్పీ రెడ్డి ప్రారంభించారు. పశు వైద్య సిబ్బంది వేణు గోపాల్, రాజు పాల్గొన్నారు.