నవీపేట్ కు రానున్న డీఎన్టీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు

నవతెలంగాణ- నవీపేట్: జాతీయ డిఎన్టి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు సభ్యులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ శివాజీ రావు ఘుగే నవంబర్ 2న (గురువారం) నవీపేట్ కు రానున్నట్టు డీఎన్టీ జిల్లా అధ్యక్షులు జాదవ్ శరత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సంచార, అర్థసంచార జాతుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు నవీపేట్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల డిఎన్టి జిల్లా అధ్యక్షులు జాదవ్ శరత్ నివాసానికి గురువారం సాయంత్రం 4 గంటలకు మర్యాదపూర్వకంగా విచ్చేసి తేనేటి విందులో పాల్గొని జిల్లాలో గల సంచార జాతుల స్థితి గతులను అంచనా వేసి వారి అభివృద్ధికి చేయాల్సిన కృషిపై పలు సంచార జాతుల ప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంబీసీ, సంచార, అర్ధ సంచార కులాల ప్రతినిధులు పాల్గొనాలని జాదవ్ శరత్ కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన వెంట సంచార జాతుల జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ పహాడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి చిరంజీవి పాల్గొంటారు.