
గాంధారి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి మదన్మోహన్ ప్రచారం నిర్వహిస్తూ నెహ్రూ చౌక్ వద్ద మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు తెలిసిపోయింది వార్ వన్ సైడ్ అయిపోయిందని చేసేదేంలేదని సురేందర్ కు ముందే తెలిసిపోయిందని మదన్ మోహన్ అన్నారు. ప్రజలకు తాను ఏ విధంగా సేవ చేశానో ప్రజలందరూ గుర్తుంచుకున్నారని కరోన కష్టకాలంలో కూడా మదన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు చేశామని అది ప్రజలకు తెలుసు అని గుర్తు చేశాడు. ఒకప్పుడు ప్రజలందరూ డబ్బులు జమచేసి నామినేషన్ కు వేయించిన ప్రజల్ని మర్చిపోయావా ఎక్కడుంది అభివృద్ధి గాంధారి మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల ఏమైంది, సంగెం రేవు మరమ్మత్తు పనులు, డబుల్ బెడ్ రూమ్ లో ఇల్లు సంగతేంటి, కాటేవాడి తండా దుస్థితి, సీసీ రోడ్ల పరిస్థితి, మిషన్ భగీరథ నీటి గురించి, పోడు భూమి పట్టాల గురించి వివిధ అంశాలపై సురేందర్ కు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అప్పుడు నామినేషన్ కు పైసలు లేకుండా కానీ ఇప్పుడు ప్రస్తుతం నీ అకౌంట్ బ్యాలెన్స్ మూడు కోట్ల కు పైగా ఉందని మదన్మోహన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి విజయ డంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు రాజు, లైన్ రమేష్,కామెల్లి బాలరాజు,మదర్, సర్దార్,సురేష్ మరియుకార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు