చంద్రబాబుకు బెయిలు టపాసులు కాల్చిన కార్యకర్తలు

నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో బుధవారం మండలంలో టీడీపీ వర్గాలు సంతోషంతో టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మహబూబాద్ పార్లమెంట్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ  53 రోజుల నిర్బంధం తర్వాత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బేఇలు మంజూరు కావడం టిడిపి గెలుపుకు సంకేతమని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని టీడీపీకి పూర్వ వైభవం ఖాయమని అన్నారు. ధర్మమే గెలుస్తుందని నిరూపణ అయిందని అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ మిఠాయిలు పంచుకొని బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ మాజీ కార్యదర్శి సూరవరపు వెంకటరామయ్య వల్లభనేని శ్రీనివాసరావు ,కందుల కట్టయ్య ,సత్యనారాయణ ,బ్రమ్మం, నాగ  చా రీ,దుగ్యా ల రమణ ,వంశీ ,చంద్రశేఖర్  ,అభిమానులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.