అనారోగ్యంతో రిటైర్డ్ టీచర్ బి ఎస్ నారాయణ మృతి

– అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో అనారోగ్యంతో రిటైర్డ్ టీచర్ బంగారు సూర్యనారాయణ మృతి చెందారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ బంగారు సూర్యనారాయణ (బిఎస్ నారాయణ)అనే విశ్రాంత ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. సూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం మండల కేంద్రంలో ఆయన నివాసంలో నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, బంధుమిత్రులు హాజరై పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
రిటైర్డ్ టీచర్ సూర్యనారాయణ అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
మండల కేంద్రంలో విశ్రాంత ఉపాధ్యాయుడు బంగారు సూర్యనారాయణ (బి ఎస్ నారాయణ) అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామమైన తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మణ్ బాబు, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, ఉత్సవ కమిటీ చైర్మన్ శివయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు బంగారు సాంబయ్య, ఉపాధ్యక్షులు రజనీకర్ రెడ్డి, గంట మనోహర్ రెడ్డి, బంగారు శ్రీరాములు, తాటి రామచందర్, అనిల్, మేడం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ లు రేగ నరసయ్య, నాలి కన్నయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పోలెబోయిన సృజన, సామాజిక న్యాయవేదిక ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎట్టి వెంకన్న, సామాజిక న్యాయవేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు, ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి టికెట్ కు అప్లై చేసిన అభ్యర్థి మడే పూర్ణిమ, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు కొర్నెబెల్లి నారాయణ, టీఎస్ యుటిఎఫ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఈసం బుచ్చయ్య, పాయం గోపాల్, యాలం ఆదినారాయణ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళలు బంధుమిత్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love