పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

నవతెలంగాణ- తాడ్వాయి
ముందుకు బానిసై మద్యం తాగిన మైకంలో పురుగుల మందు సేవించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాడ్వాయి మండలం పరిధిలోని కాటాపూర్ గ్రామంలో జరిగింది. తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని కాటాపూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి కిరణ్(20) చిన్నతనంలోనే మందుకు బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవిస్తూ తల్లిదండ్రుల మాటలు వినకుండా ఆగాధంగా తిరుక్కుంటూ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కూడా బెదిరించుకుంటూ తిరిగేవాడు. అదేవిధంగా మద్యం మత్తులో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love