కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజర్ చేయాలి…

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజర్ చేయాలని, డిమాండ్ చేశారు. బుదవారం తెలంగాణ యూనివర్సిటీ లోని మెయిన్ క్యాంపస్ లో అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు దత్తాహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఆధ్యాపకులు సమిష్టిగా సౌత్ క్యాంపస్, బీఈడీ కళాశాల క్యాంపస్, మెయిన్ క్యాంపస్ లో ఉమ్మడిగా సమావేశమై సమస్యలకు ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ,రాష్ట్రంలో 12 యూనివర్సిటీ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సి పి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా ప్రధాన డిమాండ్ ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమం గురువారం రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించి నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారని, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీలో వినూత్న కార్యక్రమం చేస్తామని డాక్టర్ వి దత్తా హరి వివరించారు.