7వ బెటాలియన్ ఉచిత ఆరోగ్య శిబిరం…

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో కమాండెంట్ యస్.వి సత్య శ్రీనివాస్ రావు అద్వర్యంలో యూనిట్ హస్పిటల్ లో మెడికవర్ హస్పిటల్, నిజామాబాద్ వారి సౌజన్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు, చుట్టు ప్రక్క గ్రామల ప్రజలు ఆరోగ్య శిబిరానికి పాల్గొని చికిత్సలు చేయించు కున్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సి. అంజనేయ రెడ్డి, కె. బాస్కర్ రావు, అర్.ఐలు పి. వేంకటేశ్వర్లు, బి. అనిల్ కుమార్, యల్. మహేష్, యం. నరేష్, బి. శ్యాంరావు, అర్. ప్రహల్లాద్, సి. సురేష్, అర్.యస్.ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.