భారత రాజ్యాంగం పై అవగాహన సదస్సు..

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాజ్యాంగ ప్రచార ఐక్య వేదిక అధ్వర్యంలో శనివారం  భారత రాజ్యాంగం లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో ప్రధాన ప్రసంగకులు నర్రా రామారావు పాల్గోని మాట్లాడుతూ భారత రాజ్యాంగం  పీఠిక లక్ష్యాలను ఆశయాలను వివరించారు. పీఠిక లోని లౌకిక వాదం ప్రాముఖ్యాన్ని వివరిస్తు ,ప్రాథమిక హక్కులు , ఆదేశిక సూత్రాలు , ప్రాథమిక విధులని పేర్కొన్నారు.విద్యార్థులు శాస్ర్తీయ విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈకార్యక్రమం లో బర్దిపూర్ సహకార సొసైటీ చైర్మన్ రామకృష్ణ ,  సాయన్న,  కళాశాల ప్రిన్సిపాల్  సంగీత , అధ్యాపక ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.