మీ బిడ్డగా గెలిపించండి .. సేవకునిగా పని చేస్తా : జీఎస్‌ఆర్‌

నవతెలంగాణ-గణపురం
మీబిడ్డగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని తదన ంతరం మీ సేవకునిగా పనిచేస్తానని టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం సీతారాంపురం గ్రామంలో డప్పు చప్పులతో ఊరేగింపుగా గంట సత్యనారాయణ రావు తో భారీ ర్యాలీ కోలాటాలతో నిర్వహించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ మండల వాసిగా ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా 108 వాహనంలా సేవ చేశానన్నారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీ సేవకునిగా పని చేస్తానని హామీ ఇచ్చారు రెండుసార్లు ఓడిపోయానని అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకు ంటున్నానన్నారు మరోసారి కాంగ్రెస్‌ పార్టీలో అవకాశం వచ్చిందని ఈసారి తనను అసెంబ్లీకి పంపిస్తే నియోజ కవర్గ ప్రజల అభివద్ధికి కొట్లాడుతానన్నారు. తనను ఆశీ ర్వదిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అవుతాడని ఇక మన రాజ్యమే అన్నారు అనంతరం వివిధ పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.