కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

నవతెలంగాణ-మహదేవ్‌పూర్‌
మహాదేవపూర్‌ మండలం బీఆర్‌ఎస్‌ మాజీ జడ్పీటీసీ, ప్రస్తుత సహకార బ్యాంకు చైర్మన్‌ చల్ల తిరుపతి రెడ,ి్డ మహాదేవ్‌పూర్‌ ఎంపీటీసీ చల్ల రమాదేవి, సింగిల్‌ విండో డైరెక్టర్‌లు కల్గూరి సమ్మక్క, పంతంగి సుమన్‌, మహాదేవపూర్‌ ఉమ్మడి మండల మాజీ బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షులు చల్ల సమ్మిరెడ్డి, కల్గురి ఉషయ్య, మంచినీళ్ళ చంద్రయ్య, గోగుల రాజగోపాల్‌, మోతె సమ్మయ్య, చేకూర్తి స్వామిరాజ్‌, మహాదే వ్‌పూర్‌ ముస్లిమ్‌ సోదరులు ఆటో లడ్డు, తాజ్‌ హుస్సేన్‌, అక్తర్‌, సీనియర్‌ నాయకులు ముదిరాజ్‌ నాయకులు 100 మంది కార్యకర్తలు కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈకార్యకమ్రంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాటారం: కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ పెరగడం వల్లే పార్టీలో చేరికలు జరుగుతున్నాయని మంథని నియోజకవర్గ అభ్యర్థి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండలం కొత్తపల్లి, దామరకుంట గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది గ్రామస్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్‌ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంత కాని సమ్మయ్య, గ్రామ సర్పంచ్‌ అజ్మీర రఘురాం నాయక్‌, బాసాని రఘువీర్‌, ఎన గంటి తిరుపతి, ఇండ్ల సందీప్‌, కుంభం రమేష్‌రెడ్డి , ఆకుల చంద్రశేఖర్‌, వినేష్‌, తది తరులు పాల్గొన్నారు.