భోపాల్ : మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకావాలన్న అధికారుల ఆదేశాలను విస్మరించడమే కాకుండా, షోకాజ్ నోటీసులో ఆయన ఇచ్చిన వివరణ ఉన్నతాధికారులను ఆగ్రహానికి గురి చేసింది. నిర్లక్ష్య వైఖరి సరికాదంటూ జిల్లా కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అఖిలేశ్ కుమార్ మిశ్రా అనే 35 ఏళ్ల ఉపాధ్యాయుడు సాత్నా జిల్లాలో సంస్కత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనాలంటూ ఉపాధ్యాయు లందరితోపాటు ఈయనకు కూడా అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరవ్వాలని కోరారు. అయితే, ఎలాంటి అనుమతి తీసుకోకుండా అఖిలేశ్ కుమార్ శిక్షణ తగతులకు గైర్హాజరయ్యారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ పైఅధికారు లు నోటీసులు జారీ చేశారు. దీనిపై అఖిలేశ్ కుమార్ స్పందిస్తూ.. ”ఇప్పటికే నాకు 35 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా పెళ్లి కాలేదు. బ్యాచిలర్‌గా ఉండలేకపోతున్నా. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయమేస్తో ంది. ముందు నాకు పెండ్లి చెయ్యండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తాను” అని అక్టోబర్ 31న రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా రూ.3.5 లక్షల కట్నం, ఆయన ఉంటున్న ప్రాంతంలో ఓ ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యా యుడి వైఖరిపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ అతడిని సస్పెండ్ చేస్తూ నవంబర్ 2న ఆదేశాలు జారీ చేశారు. అయితే, మొబైల్ ఉపయోగించకపోవడం వల్ల సస్పెన్షన్‌కు గురైన సంగతి కూడా వెంటనే ఆయనకు తెలియలేదు. సహౌద్యో గి ఒకరు ఆయనకు విషయం చెప్పడంతో తాజాగా వెలుగు లోకి వచ్చింది. అఖిలేశ్ మానసిక స్థితి సరిగా లేదని, పెండ్లి కాలేదనే ఒత్తిడిలో ఉన్నారని తోటి ఉద్యోగి ఒకరు చెప్పారు. ” లేదంటే కలెక్టర్ స్థాయి అధికారులు నోటీసులు ఇస్తే.. ఎవరైనా ఇలా రిప్లై ఇస్తారా? వ్యక్తిగత కారణాలతో గత ఏడాదిగా అఖిలేశ్ మొబైల్ కూడా వాడటం లేదు” అని ఆయన అన్నారు.