గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తా..

– మొదటి సంతకం అరు గ్యారంటీ లపైనే…
– కాంగ్రెస్ లో చేరిన డిసిసిబి డైరెక్టర్, ఇతరులు..
– కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి..
నవతెలంగాణ డిచ్ పల్లి:  రానున్న శాసన సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే తాను నిస్వార్థంగా ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, ఒక సారి అవకాశం ఇచ్చి చూడాలని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్. రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి లో ప్రచారం నిర్వహించిన అనంతరం ముదిరాజ్ కళ్యాణ మండపం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6గ్యారంటి కార్డ్ లను ప్రమాణ స్వీకారం రోజు మొదటి సంతకం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఒక సారి మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేసి తిరుతమని, ఇదే కాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు ఉంచమని, గత పదేళ్లుగా అనాడు కెసిఆర్ ఇచ్చిన హామీ నేరవేర్చా లేదని వాపోయారు. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర  ఉద్యమంలో  చురుకుగా పాల్గోని నిజామాబాదు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని అగ్రభాగాన నిలపడానికి ప్రత్యేక కృషి చేశానని వివరించారు. అసమయంలోఆర్థికంగా నష్టపోయిన డాక్టర్ వృత్తిని వదిలి పాల్గోన్నాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకే అవ కాశం వస్తుందని నమ్మిన తనకు పార్టీ టికెట్టు ఇవ్వలేదని అయినా అప్పుడు పార్టీ టికెట్టు ఇచ్చిన వ్యక్తిని గెలిపించడానికి అన్ని విదాల కష్టపడ్డానన్నారు. తర్వాత జరిగిన పరిణామాలు తనను భాదకు గురిచేశాయని త నను నమ్ముకున్న ప్రజలకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూడకండా వుండలేకుండా ఎమ్మెల్సీ పదివి పోతుందని తెలిసి ప్రజల అభిప్రాయం కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానని కాంగ్రెస్ పార్టీ తనకు న్యాయం చేయాలనే ఉద్ధేశంలో పార్టీ టికెట్టు ఇస్తే 2018లో పార్టీ తరుపున పోటీ చేశానని డబ్బు ఇతర కారణాల వల్ల అప్పట్లో ఓడి పోయినా పార్టీని ప్రజలను నమ్ముకొని పని చేశాని అన్నారు. తనకు పార్టీ మళ్లీ అవకాశ ఇవ్వడం కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకోవడం వల్లనే జరిగిందన్నారు.  ఇతరుల ప్రభావాలను లోనుకాకుండా తనను గెలిపించాలని కోరారు. పార్టీ కార్యకర్తలు తన కోసం పార్టీ కోసం ఎన్నికల వరకు నిద్రపోకుండా పనిచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అరు గ్యారంటీలను అమలు చేయడంలో తాను ప్రముఖ పాత్ర వహిస్తానన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో ఫ్రీగా ప్రయాణించ వాచ్చని, ఇదే కాకుండా పెన్షన్, రేండు లక్షల రూపాయల రూణ మాఫీ, 5లక్షల వరకు ఆరోగ్య శ్రీ, 200 వరకు నివాస గృహాలకు కరెంట్ ఫ్రీ తో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్ తోపాటు గ్రామం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్, బీజేపీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆశిష్, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.