తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగంలో కాత్యా వడ్డె పల్లి కి తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.కాత్య వడ్డేపల్లి తెలంగాణ యూనివర్సిటీ లో కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి పర్యవేక్షణలో ఇంపాక్ట్ ఆఫ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఆన్ కస్టమర్ రిటెన్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఏ స్టడీ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని తెలంగాణ యూనివర్సిటీ కి సమర్పించారు. తన పరిశోధనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్ల నిలుపుదలకై కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, వినియోగదారులను నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ విధంగా సేవలను అందిస్తూ సంతృప్తి పరుస్తుందో పరిశీలించారు. బ్యాంక్ అధికారుల కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ నైపుణ్యాలతో ఇతర బ్యాంకులకు వినియోగదారులు వెళ్లకుండా ఏ విధంగా నిలుపుదల జరిగిందో ప్రశ్నావళిని తయారుచేసి దత్తాంశాన్ని సేకరించి సమగ్రమైన గణాంకాల సాయంతో వివరించారు. కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ వినియోగదారులపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని బ్యాంకింగ్ అభివృద్ధిలో కస్టమర్ రిలేషన్షిప్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, కస్టమర్ అవగాహన సదస్సులు నిర్వహించాలని తన పరిశోధన గ్రంథంలో విశ్లేషించారు. ఈ వైవా కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా హాజరైన ప్రొఫెసర్ జై. రవికుమార్ ఉస్మానియా యూనివర్సిటీ స్టేట్ బ్యాంకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రభావం వినియోగదారులపై ఉన్న సంక్లిష్టతను ప్రయోజనాలను, వివిధ ప్రశ్నల ద్వారా పరిశోధకరాలైన కాత్యా ను ప్రశ్నించి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. తన పరిశోధనను ఎప్పటికప్పుడు తన సలహాలను,సూచనలను, గణాంకాల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించిన తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి కి పరిశోధకురాలు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఉన్నత విద్యను అందుకోవడానికి నిరంతరం ప్రోత్సహించిన తన తల్లితండ్రులకు, భర్త వడ్నాల నరేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.