నవతెలంగాణ – తిరుమలగిరి: నవంబర్ 7 మంగళవారం తిరుమలగిరి మండలం లో తుంగతుర్తి శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడవ తేదీ ఉదయం 8 గంటలకు తొండ. తొమిది గంటలకు మర్రికుంట 9:30 కు వెలిశాల 10 గంటలకు సిద్ధి సముద్రం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు 10:30 కు మొండి చింత తండా, 11 గంటలకు రాజనాయక్ తండ, 11:30 కు కొట్యా తండా, 12 గంటలకు రాఘవాపురం న ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు గుండెపురి, 4:30 కు కే ఆర్ కె తండా, ఐదు గంటలకు బండ్ల పల్లి, ఆరు గంటలకు మాలిపురం, గ్రామాల్లో ప్రచారం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పరిధిలోని ఎంపీపీ, జడ్పిటిసి, మార్కెట్ చైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.