-నిరసనగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ఎంపీటీసీ భర్త పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డిపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మను దహనం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పార్టీ పటిష్టతకు అహర్నీశలు కృషి చేసిన వారిని విస్మరించి..అభివృద్ధి పేరునా తన వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారిన దోపిడీదారులను ప్రక్కన చేర్చుకుని..నేడు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే అనుచిత వాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని మధుసూధన్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థి కవ్వంపల్లికి ప్రజల్లో పెరుగుతున్న అదరణను ఓర్వలేక ఎమ్మెల్యే రసమయి సహనం కోల్పోయి వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.