
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో అధిక ఉష్ణోగ్రతలు భగ్గునమంటున్నాయి. మండేఎండలు, వేడి గాలులకు భయపడి ప్రజలు ఇళ్ల నుంచి రావడానికే భయపడుతున్నారు. నిజాంబాద్ నగరంలో ఇప్పటికే ఇద్దరు వడదెబ్బతో చనిపోయారు అని సమాచారం ఉంది. కొద్దిరోజులుగా సుమారుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నవోదయ అవకాశాలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణశాఖ అధికారి ఆశిష్ చెబుతున్నారు. మే 31 వరకు అనగా ఈ 2 వారాలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకి రావాలని లేదంటే ఇండ్లలోనే ఉండలాని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి వెళ్ళకండి
వాతావరణ శాఖ అధికారి ఆశీష్
అత్యవసర పరిస్థితుల తప్ప వేరే ఇతర పరిస్థితులలో బయటకు వెళ్ళవద్దని ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారి ఆశీష్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీలైనంత మటుకు ఉదయం లేవగానే 9 గంటలలో తమ పనులను పూర్తి చేసుకోవాలని, సాయంత్రం ఐదు గంటల తర్వాత వీలైనంత మటుకు పనులను పూర్తి చేసుకోవాలని తెలుపుతున్నారు. 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండి ఉపశమనం పొందాలని ప్రజలను కోరుతున్నారు. ఎండలో తిరిగి ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కావున ఎండలో తిరిగి ఎండ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు మంచి నీటిని వెంటబెట్టుకుని వెళ్లాలని దాహం ఎక్కువగా అవుతున్నందున ఎక్కడపడితే అక్కడ నేను కాకుండా తమ ఇంటి నుంచి తీసుకువెళ్లిన స్వచ్ఛమైన నీరును త్రాగాలని వాతావరణ శాఖ అధికారి కోరుతున్నారు. వీలైనంత మటుకు టోపీలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలని ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదని ఎండకు నలుపు రంగు దుస్తుల వలన ఎండ వేడిమి తట్టుకోలేక పోతారని తెలియజేశారు. జూన్ రెండో తేదీన వాతావరణంలో మార్పులు కలిగి వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు కానీ భారత వాతావరణ శాఖ తెలిపిన దాన్నిబట్టి తెలియజేస్తామన్నారు.